జేబులో చిల్లిగవ్వ లేని UN

May 24, 2025: ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సభ్య దేశాలు $2.4 బిలియన్ రెగ్యులర్ బడ్జెట్, $2.7 బిలియన్ పీస్‌కీపింగ్ బకాయిలను చెల్లించలేదు. ఫలితంగా, ఖర్చులు తగ్గించటం, ఉద్యోగ నియామకాలను నిలిపివేయటం, కొంత సేవలను తగ్గించటం జరుగుతోంది. ఇది ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతను, సభ్య దేశాల నమ్మకాన్ని దెబ్బతీయొచ్చు.

కొన్ని దేశాలు పూర్తి బకాయిలు చెల్లించకపోవడమే ప్రధాన కారణం. సభ్య దేశాలన్నీ సమయానికి, పూర్తిగా చెల్లించాలి అని యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు పిలుపునిచ్చాయి. ఒక దేశం (అమెరికా) ఎక్కువ బకాయిలకు బాధ్యత వహిస్తున్నట్టు సమావేశంలో తెలియజేశారు.

ఐక్యరాజ్యసమితి సేవలు కొనసాగించేందుకు, ఖర్చు మిగిలిన నిధులను తాత్కాలికంగా నిలుపుకోవాలని ప్రతిపాదించారు. కానీ దీని వల్ల మూల సమస్య పరిష్కారం కాదు, అని నోర్వే, ఇతర దేశాలు హెచ్చరించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top