
జేష్ఠశుధ్ద దశమినే దశపాపహర దశమి అంటారు. గంగమ్మను భగీరధుడు భూమికి తీసుకొచ్చిన రోజు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని తెలుస్తోంది. గంగావతరణం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం వివరిస్తుంది. ఈ నాటి హస్తా నక్షత్ర సమయంలో భగీరథుని తపః ఫలితంగా శివుని జటాజూటంనుండి భువికి ఏతెంచింది. ఈరోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం. తెలిసీ, తెలియక పాపాలు చేయడం మానవ సహజం. అయితే మనం చేసింది పాపమని, దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదమున్నదని గ్రహించి తొలగించుకోవటం గొప్ప ప్రయత్నం
దశపాపహర దశమి మంత్రం వింటే జన్మ జన్మల నుండి పేరుకపోయిన పది రకాల పాపాలు ఇట్టే నశిస్తాయి. అలాగే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభించి , ఆ పుణ్య ఫలితంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ప్రయోజనాలి తెలుసు కోవాలంటే, ఈ వీడియో ఒక్క సారి చూడండి.