400 టర్కీ డ్రోన్లను ముక్కలు చెక్కలు చేసిన భారత సైన్యం

2025 మే 7-8 మధ్య రాత్రి, పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 300-400 డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లు SONGAR మోడల్‌కు చెందినవిగా గుర్తించబడ్డాయి, ఇవి తుర్కీకి చెందిన Asisguard సంస్థ తయారు చేసినవి. SONGAR డ్రోన్లు 5 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉండి, దిన/రాత్రి సైనిక కార్యకలాపాల్లో సమర్థవంతంగా ఉపయోగించబడతాయి.

ఈ డ్రోన్లలో చాలా unarmed (ఆయుధాలు లేని) అయినప్పటికీ, కొన్ని కెమెరాలతో ఉండి, పాకిస్తాన్ గ్రౌండ్ స్టేషన్లకు వీడియో ఫీడ్ పంపినట్లు అనుమానం వ్యక్తమైంది. భారత వాయుసేన మరియు సైన్యం ఈ డ్రోన్లను సమర్థవంతంగా గుర్తించి, వాటిని ముక్కలు చెక్కలు చేసింది. ఈ విషయాలను Col. కురేషి తెలియచేసారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *