
bridegroom dumped over failed maths test
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, రసూలాబాద్ గ్రామంలో విడ్డూరం ఘటన జరిగింది. పెళ్లి మండపం సాక్షిగా వధువు తక్షణమే పెళ్లిని రద్దు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే?
వధువు తన వరుణ్ణి ఒక చిన్న గణిత ప్రశ్న అడిగింది – “15 నుండి 7 తీసివేత ఎంత?” అని. వరుడు ఏకంగా తడబడి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. ఆ తరువాత కూడా సరైన లెక్క చెప్పకపోవడంతో వధువు ఆగ్రహానికి లోనై, ఈ పెళ్లి కొనసాగించనని స్పష్టంగా ప్రకటించింది.
అతిథులు, కుటుంబ పెద్దలు ఎంత సమాధానాలు చెప్పినా వధువు తన నిర్ణయంలో మార్పు చేయలేదు. “సాధారణ లెక్క కూడా తెలియని వ్యక్తితో జీవితం నడపలేం. కుటుంబ బాధ్యతలు ఎట్లా నిర్వహిస్తారు?” అంటూ ఆమె స్పష్టం చేశారు.
అనంతరం ఇరువర్గాలు ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు తిరిగి ఇచ్చుకుని పెళ్లి సంపూర్ణంగా రద్దయింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వివాహ సంబంధాల్లో విద్యకు ప్రాధాన్యం ఎంత అవసరం అనే ప్రశ్నను మళ్లీ తెరపైకి తెచ్చింది.